
- శిథిలాలు మీద పడి వ్యక్తి మృతి
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
మేడ్చల్, వెలుగు: ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో 2 షాపులు ధ్వంసం కాగా, శిథిలాలు మీద పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని మెయిన్ చౌరస్తాలో పూలదుకాణం, మొబైల్షాపు ఉన్నాయి.
వీటి వెనుక రేకుల ఇంట్లో వృద్ధురాలు నివాసముంటున్నది. రేకుల ఇంట్లో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి పక్కనే ఉన్న రెండు షాపులు ధ్వంసమయ్యాయి. శిథిలాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి మేడ్చల్ పోలీసులు వెళ్లి శిథిలాలు తొలగించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.