ఇచ్చిపుచ్చుకుందాం! సమస్యలను పరిష్కరించుకుందాం

ఇచ్చిపుచ్చుకుందాం! సమస్యలను  పరిష్కరించుకుందాం
  • అరగంట పాటు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాంత భేటీ
  • గవర్నర్​ ఇఫ్తార్​ విందుకు ముందు చర్చలు
  • సెక్రటేరియట్ , విద్యుత్ ఉద్యోగుల విభజన, బదిలీపై చర్చ
  • 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన వేగవంతం
  • గోదావరి, కృష్ణా నది నీటి కేటాయింపులపైనా చర్చ
  • త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

హైదరాబాద్​, వెలుగు: సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని  తెలుగు రాష్ట్రాల సీఎంలు అభిప్రాయపడ్డారు. స్నేహపూర్వక వాతావరణంలో రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. శనివారం రాజ్​భవన్​లో సీఎం కేసీఆర్​, ఏపీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి అరగంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. ముందుగా ఆ ఇద్దరు గవర్నర్​తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. ఇచ్చిపుచ్చుకోవాలన్న అభిప్రాయానికి సీఎంలు వచ్చినట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్​, అసెంబ్లీ, రెండు రాష్ట్రాల హెడ్​క్వార్టర్​లు, 9, 10 షెడ్యూల్​లోని 89 కార్పొరేషన్ల విభజన, తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల బదిలీ తదితర అంశాలను చర్చించినట్టు సమాచారం.

ఉన్నత విద్యామండలి నిధులు, కృష్ణపట్నం విద్యుత్​ ప్లాంట్​లో తెలంగాణకు రావాల్సిన వాటా, సింగరేణి కాలరీస్​లో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు, ఆర్టీసీ ఆస్తుల విభజనపైన సమస్యలకూ త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని సమాచారం. అందుకు తగ్గట్టు త్వరలోనే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ కాబోతున్నట్టు తెలిసింది. గవర్నర్​ సమక్షంలో జరిగిన సీఎంల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఏపీ స్థానికత కలిగిన 1,252 మంది విద్యుత్​ ఉద్యోగులు ఏ పనీ చేయకుండానే జీతం తీసుకుంటున్నారు. వారిని తెలంగాణ విద్యుత్​ సంస్థలు 2015 జూన్​ 11న రిలీవ్​ చేసినా, ఏపీ విద్యుత్​ సంస్థలు చేర్చుకోలేదు. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీతాలు చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సమస్య పరిష్కారానికి గవర్నర్​ చొరవ చూపినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న 821 మంది పనిచేస్తున్నారు. వారిని రాష్ట్రానికి రప్పించాలన్న డిమాండ్​ ఐదేళ్లుగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని ఏపీ స్థానికత ఉన్న 2 వేల మంది ఏపీకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించే అవకాశముందని అంతా భావిస్తున్నారు. గోదావరి, కృష్ణా నది నీటి కేటాయింపులపైనా చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

గవర్నర్​ ఇఫ్తార్​లో రెండు రాష్ట్రాల సీఎంలు

భేటీ అనంతరం రాజ్ భవన్ కు సమీపంలోని సంస్కృతి నిలయంలోగవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇద్దరు సీఎంలు అక్కడకు వెళ్లారు. ముస్లిం మత పెద్దల ప్రార్థనల అనంతరం,సీఎం కేసీఆర్ , జగన్ లు ఒకరికొకరు పండ్లు తినిపించుకున్నారు. తర్వాత జగన్ భోజనం చేయకుండానే లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ కు మాజీ గవర్నర్ రోశయ్య, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,కొప్పుల ఈశ్వర్ , మల్లారె డ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఏపీ సీఎం జగన్ వెంట ఎంపీలు విజయ్ సాయిరె డ్డి, మిథున్ రె డ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రె డ్డి హాజరయ్యారు. పలువురు ఉన్నతా-ధికారులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు విందులో పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం

ఇద్దరు సీఎంల భేటీతో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా. మనవాళ్లు ఏపీలో 821 మంది ఉన్నారు. స్పౌస్‌‌​(భార్యాభర్తలు) కేటగిరీ, ఇతరత్రా బదిలీ కోరుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోనే ఇది సాధ్యమవుతుంది.- కారం రవీందర్​రెడ్డి, టీఎన్ జీవో అధ్యక్షుడు

మాకు పోస్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నం

నాలుగేళ్లుగా మా సమస్యను పట్టిం చుకోవడంలేదు. తెలంగాణ రిలీవ్ చేసినా ఏపీ తీసుకోలేదు.ఎన్ని కలకు ముందు జగన్ ను కలిసి సమస్యలువివరించాం . ఏపీలో పోస్టిం గ్‌ ఇస్తామని ఆయనహామీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యారుకాబట్టి అక్కడ పోస్టింగ్​ ఇస్తారని నమ్మకముంది.- సురేంద్ర, రిలీవ్ అయిన విద్యుత్‌‌ ఉద్యోగి