గంజాయి నూనె అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

గంజాయి నూనె అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

గంజాయితో తీసిన హషీష్ నూనెను (గంజాయి నూనె) అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కు చెందిన సాయిగిరీశ్(21) హైదరాబాద్‌లోని  ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అతని స్నేహితుడు షేక్ సోయల్(21) డిప్లోమా చేస్తున్నాడు. వీరిద్దరూ గంజాయికి బానిసలయ్యారు. సాయిగిరీశ్ గతంలో గంజాయి సరఫరా చేస్తుండగా భద్రాచలంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అక్కడ సాయిగిరీష్‌పై కేసు నమోదైంది. అయినా కూడా గిరీశ్ పద్ధతి మార్చుకోకుండా సోయల్‌తో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల తక్కువ ఆదాయం వస్తుండటంతో.. హషీష్ నూనె అమ్మాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఇటీవల విశాఖపట్నం వెళ్లి గంజాయి నుంచి తీసిన హషీష్ నూనె కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిన్న రాత్రి వీరిద్దరూ పద్మానగర్ ఫేజ్-2 రింగ్ రోడ్డు, చింతల్ సమీపంలో హషీష్ నూనె విక్రయిస్తుండగా.. పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనం, 240 గ్రాముల హషీష్ నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

For More News..

అమీర్ పేట్‌లో ఘోర ప్రమాదం.. మెట్రో గ్రిల్‌లో తల ఇరుక్కొని యువకుడు మృతి

దొరగారికి తెలంగాణ అంటే ఆ రెండు ప్రాంతాలేనా?