
నేలకొండపల్లి, వెలుగు: రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూర మనోజ్(15), మీసాల సన్నీప్రసాద్(18) బైక్ పై నేలకొండపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా, కూసుమంచి రోడ్లో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, సన్నీప్రసాద్ అక్కడికక్కడే చనిపోయారు. మనోజ్పదో తరగతి చదువుతుండగా, ప్రసాద్డిగ్రీ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై సంతోష్ సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.