రాజస్థాన్ నుంచి సిటీకి డ్రగ్స్ ఇద్దరు సప్లయర్లు అరెస్ట్

రాజస్థాన్ నుంచి సిటీకి డ్రగ్స్ ఇద్దరు సప్లయర్లు అరెస్ట్

ఎల్​బీనగర్, వెలుగు: రాజస్థాన్ నుంచి సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఇద్దరిని సరూర్​నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్​కు చెందిన రామ్ బిస్నాయ్, దినేశ్ కుమార్ కొన్నేండ్ల కిందట సిటీకి వచ్చి పటాన్ చెరులో ఉంటూ స్టీల్ రెయిలింగ్ వర్క్ చేస్తున్నారు. డ్రగ్స్​కు బానిసైన ఇద్దరూ రాజస్థాన్​లోని ధర్మరామ్ అనే సప్లయర్ నుంచి తక్కువ ధరకు హెరాయిన్, ఓపీయం కొని సిటీకి తీసుకొచ్చి అమ్మేవారు. శనివారం సరూర్​నగర్​లో రామ్, దినేశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 గ్రాముల హెరాయిన్, 100 గ్రాముల ఓపీయంను స్వాధీనం చేసుకున్నారు.

హాష్​ ఆయిల్ సప్లయర్లు ఇద్దరు అరెస్ట్

మూసాపేట: చత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లాకు చెందిన యుగధర్ రాయ్(30), కవాసి మనోజ్(29) హాష్ ఆయిల్​ను సిటీకి తెచ్చి అమ్మేవారు. శనివారం ఉదయం 8 గంటలకు జగద్గిరిగుట్టలోని దేవేందర్ నగర్ చౌరస్తా వద్ద వీరిద్దరిని బాలానగర్​ ఎస్​వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.7 లీటర్ల హాష్ ఆయిల్​ను స్వాధీనం చేసుకున్నారు.