ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగల అరెస్ట్ 

ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగల అరెస్ట్ 

యాదాద్రి వెలుగు: గత కొన్ని రోజులుగా భువనగిరి రూరల్  పోలీస్  స్టేషన్  పరిధిలోని ఆలయాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను సోమవారం అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన బోధాసు యాదగిరి, కొమిరే శ్రీను ప్రతి రోజు రాత్రి సమయంలో గ్రామ శివారుల్లోని ఆలయాల్లో ఉన్న వస్తువులను దొంగిలిస్తున్నారని చెప్పారు. 5 గుడులలో దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుతుండగా, సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.