కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని రైనావరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. ఆ ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టు గ్రూప్‌కు చెందిన వాళ్లని జమ్ము కశ్మీర్ పోలీసులు గుర్తించారు. అనేక టార్గెటెడ్ హత్యలు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడిన కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మృతులు రయీస్ అహ్మద్ భట్, హిలాల్ అహ్ రాహ్ గా గుర్తించామన్నారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

రయీస్ అహ్మద్ భట్ అనంతనాగ్ లో గత ఏడాది నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కు పాల్పడుతున్నాడని కశ్మీర్ పోలీసులు చెప్పారు. అతడిపై ఇప్పటికే రెండు ఉగ్రవాద నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు తెలిపారు. అయితే అహ్మద్ భట్ డెడ్‌బాడీ దగ్గర ఒక ప్రెస్ ఐడీ కార్డు దొరికిందని, ఎంక్వైరీ చేయగా అతడికి మీడియాతో ఎటువంటి సంబంధం లేదని తేలిందని, అది ఫేక్ ఐడీ కార్డు అని పోలీసులు వివరించారు. ఇక మరో టెర్రరిస్ట్ హిలాల్‌ను బిజ్‌బెహరా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించామన్నారు. అతడొక సీ కేటగిరీ టెర్రరిస్ట్ అని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

పెట్రోల్ రేటు మళ్లీ పెరిగింది

జైల్లో చదివిండు.. ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్