నల్గొండ జిల్లాలో 2వేల ఏండ్ల కిందటి నాణేలు

నల్గొండ జిల్లాలో 2వేల ఏండ్ల కిందటి నాణేలు

హైదరాబాద్, వెలుగు: నల్లగొండ జిల్లాలో 2 వేల ఏండ్ల కిందటి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన తవ్వకాలలో బౌద్ధ మత సంబంధమైన అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్థంభాలు వెలుగుచూశాయి. అలాగే 3 వేల 700 సీసపు నాణేలను పురావస్తు పరిశోధకులు వెలికితీశారు. 

శాతవాహనుల సామంతులైన మహాతలవరులకు సంబంధించిన నాణేలుగా భావిస్తున్నారు. ఫణిగిరి క్రీపూ.3 వ శతాబ్దం– క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్య కాలంలో బౌద్ధ మతానికి సంబంధించిన కీలకమైన కేంద్రం. ఇక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపం, విహారం, చైత్యాలు ఉన్నాయి.  తొలుత 1941లో అప్పటి నిజాం ప్రభుత్వం ఫణిగిరి గ్రామంలో మొదటిసారి తవ్వకాలు జరిపింది. తర్వాత 2002, 2015లో కూడా తవ్వకాలు జరిగాయి.