ఉస్మానియాలో ట్రాన్స్ జెండర్ డాక్టర్లు నియామకం

ఉస్మానియాలో ట్రాన్స్ జెండర్  డాక్టర్లు నియామకం

హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్ మరో ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారి ట్రాన్స్ జెండర్లు వైద్యసేవలు అందిస్తున్న  ప్రభుత్వ దవాఖానగా గుర్తింపు  పొందింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు రుత్ జాన్‌  పాల్‌ , ప్రాచీ రాథోడ్‌..కాంట్రాక్ట్ పద్దతిలో ఆస్పత్రిలో ఉద్యోగం పొందారు. తాము పని చేసేందుకు అవకాశం కల్పించిన హాస్పిటల్ సూపరిండెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు..పీజీ చేసేందుకు రిజర్వేషన్లు కల్పించాలని రూత్, ప్రాచీలు కోరుతున్నారు. ఈ ఇద్దరిలో డాక్టర్‌ రూత్‌ది ఖమ్మం.. డాక్టర్‌ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్‌ జిల్లా.

తాము చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు. తమ బట్టలు, మాట తీరు చూసి హేలన చేసేవాళ్లని అన్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ లో కూడా 15 హాస్పిటల్స్ తిరిగామని..ఎక్కడికెళ్లినా తమను తిరస్కరించారు. అందుకు కారణం చెప్పకపోయినా అర్థం చేసుకున్నామని అన్నారు. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలని ఓ ప్రైవేటు హాస్పిటల్ కోరినట్టు ప్రాచీ చెప్పారు.