డెడ్ బాడీని మూటకట్టి తీస్కపోతున్నరు

డెడ్ బాడీని మూటకట్టి తీస్కపోతున్నరు

ఎల్బీ నగర్, వెలుగు: ఇద్దరు యువకులు గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీని మూట కట్టుకొని తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. హయత్ నగర్ లోని తొర్రూరు రోడ్డులో బాతుల చెరువు సమీపంలో ఇద్దరు యువకులు ఓ డెడ్ బాడీని దుప్పట్లో చు ట్టుకొని తీసుకెళ్తున్నారు. స్థానిక యువకులు గమనించి వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో యువకులను అనుమానించి పట్టుకొని పోలీసులకు అప్ప గించారు. వీరు స్థానిక హనుమాన్ నగర్ లో ఉంటున్నట్లు మహిళ అనారోగ్యంతో మృతి చెందినట్లు, డెడ్ బాడీని పడేసేందుకు తీసుకె ళ్తున్నట్టు ఇద్దరు యువకులు చెప్పుకొచ్చినట్లు తెలిసింది. ఓ యువకుడు తనది లవ్ మ్యారేజ్ అని ఆమె తన భార్య అని చెప్పుకున్నట్టుగా, అతని పేరు వినోద్ అని, నెల్లూరుకు చెందిన వాడినని చెప్పినట్టుగా స్థానికులు పేర్కొన్నా రు. ఆమె ఒంటిపై ఎలాంటి బట్టలు లేకపో వడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు వారిని విచారిస్తే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.