
వరంగల్ : నర్సంపేటలో కొంతమంది కాలేజీ యువకులు హల్చల్ చేశారు. బస్టాండ్లో రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నారు. సినిమా లెవల్లో ఫైటింగ్కి దిగారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో యువకులు అక్కడినుంచి పరారయ్యారు. ఓ అమ్మాయి విషయంలోనే యువకులు బాహాబాహీకి దిగినట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.