భారత విమానాలపై నిషేధం పొడిగించిన UAE

V6 Velugu Posted on Jun 09, 2021

భారత్‌లో కరోనా కేసుల వ్యాప్తి కారణంగా విమానాలపై ఏప్రిల్‌ 24 న విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది. ఇప్పుడు మరో మారు నిషేధాన్ని పొడగించింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయి నుంచి భారత్‌కు విమానాలు వెళ్లడానికి ఇప్పటికి అనుమతి ఉన్నప్పటికీ, భారత్‌ నుంచి మాత్రం విమానాల రావడాన్ని బ్యాన్ చేసింది. భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై వరకు పొడిగించాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్ధ తెలిపింది.
కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు, ఎంపిక చేసిన గోల్డెన్‌ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.

Tagged India flights, UAE extends suspension, July 6, Air India Express

Latest Videos

Subscribe Now

More News