దుబాయ్: 15 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం విధించింది. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలు ఇప్పటికే నిషేధం విధించగా, ఇప్పుడు యూఏఈ కూడా అదే బాట పట్టింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 15 ఏండ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వ్యక్తిగత ఖాతాలను సృష్టించడం చట్టవిరుద్ధం. ఇతరులతో చాటింగ్ చేయడం, పోస్ట్‌లు పెట్టడం, కామెంట్లు చేయడం, షేర్ చేయడం, పబ్లిక్ గ్రూప్‌లు, ఓపెన్ చానెల్స్‌లో చేరడం వంటి ఎలాంటి ఫీచర్లనూ పిల్లలు యాక్సెస్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి అరబ్ దేశం యూఏఈ.
