
ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా జరగని ఊహించని సంఘటనలు పాక్ క్రికెట్ లో జరుగుతాయి. వీరు చేసే వింత పనులకి ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో చోటు చేసుకుంది. పీఎస్ఎల్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్ 22) ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన వింత సంఘటన ఒకటి వైరల్ గా మారుతుంది. ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా అత్యుత్సాహం కారణంగా తమ జట్టు ఉస్మాన్ ఖాన్ గాయాలపాలయ్యాడు. 229 పరుగుల లక్ష్య ఛేదనలో లాహోర్ ఖలందర్స్ విజయం కోసం పోరాడుతోంది. ఇన్నింగ్స్ 15 ఓవర్ చివరి బంతికి ఉబైద్ షా ఒక స్లో బాల్ తో బిల్లింగ్స్ ను ఔట్ చేశాడు.
మ్యాచ్ లో ఈ వికెట్ కీలకం కావడంతో ఉబైద్ షా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సంతోషంతో సెలెబ్రేషన్ ఓ రేంజ్ లో చేసుకున్నాడు. ఈ క్రమంలో నియంత్రణను కోల్పోయాడు. సహచర వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ కు హైఫై ఇచ్చే ప్రయత్నంలో అతని తలకేసి గట్టిగా బాదాడు. అత్యుత్సాహంలో ఉబైద్ షా తన అరా చేతితో ఉస్మాన్ తలను గట్టిగా కొట్టడంతో నొప్పితో అక్కడే పడిపోయాడు. హెల్మెట్ లేకుండా ఉండడంతో ఒక్కసారిగా ముల్తాన్ శిబిరంలో ఆందోళన కలిగింది. వెంటనే వైద్య శిబిరం వచ్చి అతనికి చికిత్స ఇవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Also Read:-ఉగ్రదాడి మృతులకు బీసీసీఐ నివాళి.. SRH vs MI మ్యాచ్లో కీలక మార్పులు
ఈ మ్యాచ్ లో ఉబైద్ షా 4 ఓవర్లలో 33 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మరోవైపు బిల్లింగ్స్ 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి ముల్తాన్ ను వణికించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముల్తాన్‌లో సుల్తాన్స్ 33 పరుగుల తేడాతో లాహోర్ ఖలందర్స్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో లాహోర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Ubaid Shah bohot hi excited ho gaya hai aaj galto se Usman Khan saamne a gaya
— Numair Tariq (@NumairTariq2) April 22, 2025
pic.twitter.com/v1sLFZaqbT