
ఉబెర్ ట్యాక్సీ కంపెనీ ఇప్పడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ల్లోకి వచ్చేసింది. అంటే ఇకనుంచి మెట్రో సిటీల్లో తిరిగే సిటీ బస్‌ల్లో ఉబెర్ యాప్ సాయంతో సీట్ బుక్ చేసుకోవచ్చన్నమాట. యాప్‌లో కార్, బైక్, ఆటో సర్వీస్‌లతో పాటు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసి ఎక్కడికి వెళ్లాలో ప్లేస్ ఎంటర్ చేయాలి. తరువాత వెళ్లాల్సిన రూట్‌మ్యాప్‌తో పాటు, టికెట్ రేట్, బస్ నెంబర్స్, టైమింగ్స్ కూడా చూపిస్తుంది. వెళ్లాల్సిన డెస్టినేషన్‌కు నేరుగా బస్ ఫెసిలిటీ లేకపోతే తరువాతి బస్ వివరాలు చూపెడుతుంది. దీన్ని ప్రస్తుతం గురుగ్రామ్‌లో టెస్ట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ఉబెర్ సీఈఓ ప్రభుజీత్ సింగ్.