యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ షురూ

యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ షురూ

హైదరాబాద్, వెలుగు: స్కూల్ స్టూడెంట్స్​లో ఆటలపై ఆసక్తిని, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను పెంపొందించే లక్ష్యంతో యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్  ప్రారంభమైంది. 7– 15 ఏండ్ల వయసు స్టూడెంట్ల కోసం  ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్రయాథ్లాన్ తరహా పోటీలకు హైదరాబాద్‌‌‌‌లోని 500కు పైగా స్కూల్స్ రిజిస్టర్ చేసుకున్నాయి. 60 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, బాల్ త్రో వంటి మూడు ప్రధాన ఈవెంట్‌‌‌‌లతో  కిడ్స్ కప్ రూపొందించారు. 

శుక్రవారం సికింద్రాబాద్‌‌‌‌లోని జీహెచ్‌‌‌‌ఎంసీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌‌‌‌లో నిర్వహించిన ‘ట్రైన్ ది ట్రైనర్స్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల కోచ్‌‌‌‌లకు ఈ పోటీల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా డీవైఎస్‌‌‌‌ఓ సుధాకర్ రావు,  గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్‌‌‌‌ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజా రావు, ఇంటర్నేషనల్ హ్యాండ్‌‌‌‌బాల్ ప్లేయర్, కోచ్‌‌‌‌ జగన్ మోహన్ గౌడ్, యూబీఎస్ హెడ్ నేహా లడ్డా, యూబీఎస్ అథ్లెటిక్ మీట్ హెడ్ అనిఖేత్ వాగ్లే పాల్గొన్నారు.