
UCO బ్యాంక్ 2025-26 సంవత్సరానికి దేశమంతటా 532 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూకో బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది అక్టోబర్ 30, ఫీజు చెల్లింపుకు చివరి తేది: నవంబర్5. పూర్తివివరాలు..
ALSO READ : రైల్వే నోటిఫికేషన్ విడుదల
ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్ - 7, తెలంగాణ - 8, తమిళనాడు - 21, కర్ణాటక - 12, కేరళ - 10, ఉత్తరప్రదేశ్ - 46, పశ్చిమ బెంగాల్ - 86, బిహార్ –35, ఇతర రాష్ట్రాల్లో మిగిలిన ఖాళీలు భర్తీ చేస్తారు.
అర్హత..
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: అక్టోబర్ 1, 2025 నాటికి అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ..
ఆన్లైన్ పరీక్ష
స్థానిక భాషా పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (రిజర్వేషన్ నిబంధనల ప్రకారం)
పరీక్ష విధానం (మొత్తం:100 మార్కులు, వ్యవధి: 60 నిమిషాలు)
జనరల్/ఆర్థిక అవగాహన –25 మార్కులు
ఇంగ్లీష్/హిందీ భాష –25 మార్కులు
రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్– 25 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ –25 మార్కులు
స్టైపెండ్..
శిక్షణ కాలంలో ఎంపికైన అప్రెంటిస్లకు నెలకు రూ.15,000 స్టైఫండ్ లభిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, UCO బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లోని దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు ..జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.800 + GST
PWBD: రూ. 400 + GST
SC/ST: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 21, 2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 30, 2025
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: నవంబర్ 5, 2025
ఆన్ లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 9, 2025
చివరి నిమిషంలో వచ్చే సమస్యలను నివారించడానికి అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషనన్ ను జాగ్రత్తగా చదివి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.