
రైల్వేలో ఉద్యోగం చేయాలనీ కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ) కింద నియామకాలనీ ప్రకటించింది. దింతో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 8,500 కంటే పైగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
RRB గ్రాడ్యుయేట్ & అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ లో వేర్వేరు ఖాళీలు ప్రకటించింది. గ్రాడ్యుయేట్ స్థాయిలో మొత్తం 5,800 పోస్టులు భర్తీ చేయనుండగా.... వీటిలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ సహా ఇతర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2025న ప్రారంభమై 20 నవంబర్ 2025 వరకు కొనసాగుతుంది.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వీటిలో జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సహా ఇతర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2025న ప్రారంభమమై 27 నవంబర్ 2025 వరకు కొనసాగుతుంది.
ALSO READ : NMLలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు... జీతం రూ. 71 వేలు
ఎలా అప్లయ్ చేసుకోవాలంటే :
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో "RRB NTPC 2025 రిక్రూట్‌మెంట్" లింక్‌పై క్లిక్ చేయాలి. తరువాత, "కొత్త రిజిస్ట్రేషన్" కు వెళ్లి మీ పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. దరఖాస్తు ఫామ్‌లోని అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసాక అవసరమైన డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ ప్రింట్ అవుట్ డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోండి.
అర్హత:
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తప్పనిసరి పాసై ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థులు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల అదనపు వయో సడలింపు ఉంటుంది అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల అదనపు వయో సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు :
జనరల్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500. రిజర్వ్డ్ కేటగిరీ SC, ST, PwD, మహిళలు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు రూ. 250.
ఎంపిక ప్రక్రియ:
RRB NTPC సెలెక్షన్ ప్రక్రియ కంప్యూటర్ టెస్ట్(CBTలు), స్కిల్ టెస్ట్, టైపింగ్ లేదా ఆప్టిట్యూడ్ పరీక్షల ద్వారా జరుగుతుంది.
జీతం : 7వ కేంద్ర వేతన సంఘం (CPC) కింద జీతం లభిస్తుంది. అలాగే పోస్టును బట్టి జీతం మారుతూ ఉంటాయి.
మరింత సహమాచారం కోసం RRB NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదా పూర్తి వివరాల కోసం ఆర్‌ఆర్‌బి వెబ్ సైట్: www.rrbsecunderabad.nic.inhttps://rrbsecunderabad.gov.in/లో చూడండి.