కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మనిషి కడుపు నింపుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఉదయపూర్ లో 85 ఏళ్ల వృద్దుడు సంతోషంగా ఉండేందుకు సమోసాలు అమ్ముతున్నానని ఓ కష్టమర్ కు అతనికి మధ్య జరిగిన సంభాషణలో చెప్పగా.. ఆయన ఆ మాటలతో సహా వృద్దుడు సమోసాలు అమ్ముతున్న ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
ఎవరు ఏ పని చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. సంతోషమైనా.. విచారమైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉదయ్‌పూర్‌లో సమోసాలు అమ్మే వృద్ధుడు అతను చేసే పనిపై తనకున్న ఆలోచనను నెటిజన్లతో పంచుకున్నాడు. ఉదయ్ పూర్ కోర్టు సర్కిల్ ప్రాంతంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ వృద్దుడు సమోసాలు అమ్ముతున్నాడు. అయితే ఆయన తాను చేసే పని పట్ల ఎంత నిబద్దత ఉందో ఓ కష్టమర్ కు వివరించాడు. ఆయన చెప్పిన అనుభవాన్ని ట్విట్టర్ యూజర్ ఆరైన్ష్ పోస్ట్ చేశాడు.
ఇంత వృద్ధాప్యంలో ఎందుకు విశ్రాంతి తీసుకోలేదని అతను అడిగాడు. ఆ వృద్ధుడు చెప్పిన సమాధానంతో ట్విట్టర్ యూజర్ ఆరేన్ష్ ఆలోచనను పూర్తిగా మార్చింది. సమోసాలు అమ్మే వృద్దుడు హిందీలో మాట్లాడుతూ... బేటా, మెయిన్ అబ్ ఈజ్ ఉమ్రా మే పైసే కే లియే కామ్ నహీ కర్తా. నా హృదయాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ కూర్చోవడం కంటే ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం మంచిది. జబ్ మైన్ చార్ లోగోన్ కే ఖుష్ చెహ్రే దేఖ్తా హున్, జో మేరే ఖానే కా స్వాద్ లేతే హై, తో మేరా దిల్ ఖుషీ సే భర్ జాతా హై" ( ఈ యుగంలో నేను డబ్బు కోసం పని చేయను. నా హృదయాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి పని చేస్తాను. ఇది ఉత్తమం ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కంటే ఇక్కడ ఉండటమే..సంతోషం. నేను తయారు చేసే ఆహార రుచిని ఆస్వాదించే వ్యక్తుల సంతోషకరమైన ముఖాలను చూస్తే, నా హృదయం ఆనందంతో నిండిపోతుంది).
ఈ సెంటిమెంట్ తో సమోసాలు అమ్మే ఆ ముసలాయన ఫొటో తో పాటు ఆ కస్టమర్ పోస్ట్ చేశాడు. నెటిజన్లు ఈ వ్యక్తి చెప్పిన మాటలను మెచ్చుకోవడంతో ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది. దీనిపై స్పందించి ట్విట్టర్లు యూజర్లు చాలా సరిగ్గా చెప్పారు. ఇప్పటికీ డబ్బు కోసం కాకుండా తమ పనిని ప్యాషన్‌గా చేసేవారు చాలా మంది ఉన్నారు” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. "పని చేయాలనే దృఢ సంకల్పంతో నా హృదయాన్ని కురిపించే వ్యక్తి" అని మరొకరు కామెంట్ చేశారు.

