బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వద్దు.. ప్లాస్మా దానం చేయండి: థాక్రే

బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వద్దు.. ప్లాస్మా దానం చేయండి: థాక్రే

ముంబై: కరోనా కారణంగా ఈ ఏడాది తను పుట్టిన రోజు జరుపుకోవడం లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ చేయకుండా అభిమానులు, కార్యకర్తలు రక్తదానం, ప్లాస్మా దానం చేయాలని ఉద్ధవ్‌ థాక్రే పిలుపునిచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, బొకేలు కొనే బదులుగా ఆ డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు సీఎంవో ఆఫీస్‌ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. ఈ నెల 27న ఉద్ధవ్‌ థాక్రే పుట్టిన రోజు. మహారాష్ట్రలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 10,576 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,37,607కి చేరింది. వాటిలో 1,36,980 యాక్టివ్‌ కేసులు కాగా.. 1,87,769 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 12,556 మంది చనిపోయారు.