ఎండింగ్ కు మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్

ఎండింగ్ కు మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్

మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ ఎండింగ్ కు చేరింది. రేపు బలపరీక్షకు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు గవర్నర్. దీంతో రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. బలపరీక్షపై సీఎం ఉద్ధవ్ కు గవర్నర్ కోశ్యారీ లేఖ రాశారు. అయితే గవర్నర్ నిర్ణయంపై శివసేన నేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  

బలపరీక్ష కోసం ముంబయి వెళ్తాం

బలపరీక్ష కోసం రేపు ముంబైకి వెళుతున్నామన్నారు ఏక్ నాథ్ షిండే. అసోం గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దర్శించుకున్నారు.  మహారాష్ట్రలో శాంతి, సంతోషం కోసం ప్రార్ధించానని షిండే అన్నారు. ఇక రోజురోజుకు ఏక్ నాథ్ షిండే మద్దతు పెరుగుతోంది. మరి కొంతమంది నేతలు షిండే క్యాంపులోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షిండే  క్యాంపులో 39 శివసేన నేతలు ఉన్నారు. ఇండిపెండెంట్ లు,  ఇతర ఎమ్మెల్యేలు  మరో 10మంది కూడా  షిండే వర్గంలో  ఉన్నారు. అయితే  రెబల్ నేతల్లో  కొందరు తమతో  కాంటాక్ట్ లో ఉన్నారని  శివసేనే చెబుతోంది.  కానీ  శివసేనలో 19 ఎంపీలు ఉండగా  వారిలో మరికొందరు  షిండే క్యాంపులో చేరేందుకు సిద్ధమవుతున్నారని  తెలుస్తోంది. అలాగే త్వరలోనే గవర్నర్ ను కలుస్తామని  షిండే కూడా ప్రకటించారు

మరోవైపు షిండే వర్గంతో కలిసి  బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కసరత్తు  చేస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శల మధ్య మహా రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. నిన్న ఢిల్లీలో  అమిత్ షా, జేపీ నడ్డాను ఫడ్నవీస్ కలిశారు. రాజకీయ పరిణామాలపై  చర్చించారు. తర్వాత ముంబై వచ్చిన ఫడ్నవీస్..గవర్నర్ కోశ్యారీని కలిశారు. ఉద్దవ్ థాక్రే మెనార్టీలో  పడ్డారని, బలనిరూపణకు  థాక్రేను ఆహ్వానించాలని గవర్నర్ ను  కోరారు.

కూర్చుని మాట్లాడుకుందాం : ఉద్దవ్ ఠాక్రే

ఇప్పటి వరకు  కాస్త బెదిరింపు  ధోరణి..ముంబై రండి చూసుకుందాం అంటూ  మాట్లాడిన  ఉద్దవ్ థాక్రే వర్గం  కూడా దిగొచ్చింది. రెబల్ ఎమ్మెల్యేలు  ముంబైకు రావాలని.. కూర్చొని  మాట్లాడుకుందామని విజ్ఞప్తి  చేస్తున్నారు. వెనక్కి వచ్చే  నేతల కోసం  శివసేన పార్టీ ..డోర్స్ ఓపెన్  చేసే ఉంటాయని  మంత్రి ఆదిత్య థాక్రే  చెబుతున్నారు. తిరుగుబాటు  ఎమ్మెల్యేలను  వెనక్కి రప్పించేందుకు బుజ్జగింపు చర్యలు  మొదలు పెట్టింది థాక్రే వర్గం. అలాగే తమకు సంపూర్ణ మద్ధతు ఉందని శివసేన  నేతలు చెప్పుకొస్తున్నారు. అవిశ్వాసం పెడితే సుప్రీం  ఆశ్రయించే  యోచనలో ఉద్ధవ్ థాక్రే  ఉన్నట్లు తెలుస్తోంది.