సుప్రీంకు చేరిన శివసేన పంచాయతీ..

సుప్రీంకు చేరిన శివసేన పంచాయతీ..

మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు  ఈసీ  కేటాయించడాన్ని సవాలు చేస్తూ  ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ పిటిషన్  అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది.  రేపు(మంగళవారం) మళ్ళీ బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది.

ఈ నెల 17 ఎన్నికల సంఘం  షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం  ఎన్నికల గుర్తును కేటాయించాలని ఆదేశించింది. అయితే దీనిని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా ఖండించింది. ఈసీ నిర్ణయాన్ని తప్పబట్టింది. శివసేన పార్టీ పేరు,గుర్తు ఏక్ నాథ్ షిండేకు కేటాయించడం వెనుక రూ.2000 కోట్ల డీల్ జరిగిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. త్వరలోనే దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకొస్తాయని చెప్పారు.