ఎంపీలు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు

 ఎంపీలు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన అధినేత, మహారాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన మద్దతును ప్రకటించారు. గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందన్నారు. " శివసేన ఎంపీలు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, కానీ వారు సూచించారు. వారి సూచనను వింటూ, రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వబోతున్నాం" అని ఠాక్రే తెలిపారు. శివసేనకు చెందిన 18 మంది ఎంపీలలో 16 మంది ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.  కాగా  జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ముర్ముకు పోటీగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.  జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.