ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ దశలో స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. "షిండే వర్గం వాళ్లు EC ముందు వాదనల్లో విజయం సాధించారు. ఈ దశలో మేము ఆర్డర్‌పై స్టే ఇవ్వలేం" అని సుప్రీంకోర్టు పేర్కొంది.

విల్లు, బాణం గుర్తుతో ఏక్‌నాథ్ షిండే గ్రూపును శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం ఈనెల 17వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి పార్టీ పేరు, విల్లు, బాణం గుర్తును ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ శిబిరానికి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు.. ఉద్ధవ్ వర్గం వేసిన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. 2 వారాల తర్వాత సుప్రీంకోర్టు  విచారణ చేపట్టనుంది.