ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు

ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు

కరోనాతో కుదేలైపోయిన పర్యాటకరంగాన్ని అభివృద్ది చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్పే బీచ్ లో టూరిస్ట్ లను ఆకర్షించేందుకు సముద్రంలో తొలిఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. దీన్ని డూపీ ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రారంభించారు. నీటిపై తేలియాడే బ్రిడ్జి కావడంతో టూరిస్ట్ లను విశేషంగా ఆకట్టుకుంటుంది. సముద్రపు అలల ధాటికి బ్రిడ్జి పైకి..కిందకి కదలాడటం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దీనిపై వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వంతెనపైకి వెళ్లేందుకు కేవలం 20 నుంచి 25 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ లను ధరించి  బ్రిడ్జిపైకి వెళ్లాలని ఎమ్మెల్యే రఘుపతి సూచించారు. బీచ్ లో పర్యాటకాన్ని అభివృద్ధి పరిచేందుకు ఈ వంతెనను నిర్మించామని చెప్పారు. సముద్రంలో ఏర్పాటు చేసిన ప్లోటింగ్ బ్రిడ్జిపైకి వెళ్లిన టూరిస్ట్ లు కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్రపు అలలు ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో  బ్రిడ్జిని తాకడంతో పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సముద్రంలో తేలియాడే వంతెనపైకి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు టూరిస్ట్ లు క్యూ కడుతున్నారు. 

సమ్మర్ సీజన్ కావడంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని చూసేందుకు ప్రజలు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరికొందరు బోటులో షికారు చేస్తూ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

గ్రూప్​ 1  ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ ప్లాన్​