గూగుల్‌పై న్యాయపోరాటానికి సిద్దమైన కర్ణాటక

గూగుల్‌పై న్యాయపోరాటానికి సిద్దమైన కర్ణాటక
  • కన్నడను చెత్త భాష అని చూపినందుకే
  • తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పిన గూగుల్

బెంగళూరు: గూగుల్ సెర్చ్ ఫలితాల్లో కన్నడను చెత్త భాషగా చూపినందుకు గూగుల్‌పై న్యాయ పోరాటం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. భారతదేశంలో అతి చెత్త భాష కన్నడ అని గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వస్తుండటంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తమ భాషను కించపరిచినందకు గూగుల్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నిరసనల నేపథ్యంలో గూగుల్ తన తప్పును సరిదిద్దుకుంది. భారతదేశంలో చెత్త భాష అంటే కన్నడ అని వస్తున్న ఫలితాలను తొలగించింది. ఇది ఏమాత్రం తమ ఉద్దేశం కాదని చెబుతూ.. కన్నడ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పింది. గూగుల్ తప్పిదంపై కర్ణాటక రాష్ట్ర కన్నడ కల్చర్ మినిస్టర్ అరవింద్ లింబావళి స్పందించారు. భాషను కించపరుస్తూ.. అలాంటి ఫలితాలను చూపినందుకు గూగుల్‌కు లీగల్ నోటీసులు పంపుతామని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కన్నడ భాషకు, కన్నడిగులకు గూగుల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నడ భాషకు 2,500 ఏళ్ల చరిత్ర ఉందని.. తరాలుగా తమ రాష్ట్రానికి భాషే గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు.