ఉగ్రం మూవీ రివ్యూ.. అల్లరోడు మాస్ హిట్ కొట్టాడా?

ఉగ్రం మూవీ రివ్యూ.. అల్లరోడు మాస్ హిట్ కొట్టాడా?

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఉగ్రం మూవీ మే 5 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఓవర్సీస్ ప్రీమియర్స్, మార్నింగ్ షోస్ చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలను చూస్తుంటే.. అల్లరోడు తన ఉగ్రరూపం చూపించినట్లుగా తెలుస్తోంది. కేరీర్ లో ఇప్పటివరకు కామెడీ పాత్రల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన అల్లరి నరేష్.. గమ్యం, మహర్షి, నాంది, మారేడుమిల్లి సినిమాలతో తనలోని అసలైన నటుడిని పరిచయం చేశాడు. ఇక.. అల్లరి నరేష్ గత సినిమా నాంది సినిమాలో ఆయన నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరోసారి ఉగ్రం అనే మాస్ అండ్ ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు తెలసుకుంది.  

ముందు కథ విషయానికి వస్తే. హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా పెరిగిపోతున్న స‌మయంలో ఆడపిల్లలు, మహిళలు వరుసగా కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ మాఫియాకు సీఐ శివ కుమార్ (అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి అవుతారు. ఇక శివ కుమార్ కి ఓ కూడా ఓ భయంకరమైన నేపథ్యం ఉంటుంది. అస‌లు ఈ శివ కుమార్ ఎవరు? వరుస కిడ్నాప్ ల వెనుక ఉంది ఎవరు? శివ కుమార్ ఈ మాఫియాకు ఎలా చెక్ పెట్టారు? అనేది మిగతా కథ.  ఇక నటీనటుల విషయానికి వస్తే.. పోలీస్ శివ కుమార్ పాత్రలో అల్లరి నరేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.ఈ సినిమా కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. మరోసారి తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు అల్లరి నరేష్. ఇక నరేష్ భార్య గా మిర్నా , డాక్టర్ గా ఇంద్రజ తమ తమ పాత్రల మేరకు బాగానే నటించారు. పాత్రలు ఉన్నవి తక్కువే ఈ సినిమా మొత్తం నరేష్ చుట్టే తిరుగుతుంది.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాదగుంది కానీ.. కథనాన్ని ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది.. లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరవాత నుంచి అసలు పాయింట్  ట్రాక్ ఎక్కుతుంది. ఆతరువాత వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. మిస్టరీని సాల్వ్ చేయడం, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి కాస్త ఊర‌ట క‌లిగిస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లవల్లో ప్లాన్ చేశారు.  ప్రొడ‌క్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ అండ్  బీజీఎం కూడా  ప‌ర్వలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే ఉగ్రం మూవీ ఒక రొటీన్ ఎమోషనల్ డ్రామా. ఒకసారి చూసేయొచ్చు. అదికూడా అల్లరి నరేష్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి.