ఆధార్ ప్రైవసీకి కొత్త రూల్?.. త్వరలో ప్రకటించనున్న యూఐడీఏఐ

ఆధార్  ప్రైవసీకి కొత్త రూల్?.. త్వరలో ప్రకటించనున్న యూఐడీఏఐ

న్యూఢిల్లీ: హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు వంటి సంస్థలు వెరిఫికేషన్ కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్ ఫోటోకాపీలు తీసుకొని, దాచకుండా  ఉండడానికి కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తీసుకురానుంది. 

 ఈ సంస్థ సీఈఓ  భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఆధార్ వెరిఫికేషన్ కోరే సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్  చేసుకోవాలి. వీరికి క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్ స్కాన్ లేదా కొత్త ఆధార్ యాప్ ద్వారా వెరిఫికేషన్ చేసే టెక్నాలజీని అందిస్తాం” అని అన్నారు.  ఈ  రూల్‌‌‌‌‌‌‌‌తో పేపర్ ఆధారిత వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించాలని యూఐడీఏఐ చూస్తోంది.  ఈ సంస్థ కొత్త యాప్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేస్తోంది. దీంతో  ఆధార్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు ప్రతిసారి సెంట్రల్ ఆధార్ డేటా బేస్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అవ్వాల్సిన​ అవసరం ఉండదు. ఇది  యాప్‌‌‌‌‌‌‌‌ టు యాప్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు, ఆధార్ అవసరముండే షాపుల్లో వాడొచ్చు.