
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్ పై కీలక నిర్ణయం ప్రకటించింది UIDAI. ఇకపై స్కూళ్లలో బాల ఆధార్ కార్డును అప్డేట్ చేయనున్నట్లు తెలిపింది. రాబోయే రెండు నెలల్లో దశల వారీగా పిల్లల ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్స్ ప్రారంభించనుంది.
ఐదేళ్లు నిండిన పిల్లల బాల ఆధార్ కార్డును ఏడేళ్లు వచ్చేలోపు బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. పిల్లలు, తల్లిదండ్రులను సౌకర్యార్థం ఇకపై స్కూళ్లలో బాల ఆధార్ అప్డేట్ చేయనున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ( UIDAI) తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అప్డేట్ కాని పిల్లలు7కోట్ల మంది ఉన్నారు.రాబోయే 45నుంచి 60 రోజుల లోపు పాఠశాలల్లో బాల ఆధార్ అప్డేట్ ప్రాజెక్టను చేపట్టనున్నట్లు ఉడాయ్ తెలిపింది. ఈ ప్రాజెక్టులో వారి పేరెంట్స్ అనుమతితో స్కూళ్ళలోనే వేలిముద్రలు, ఐరిస్, ఫొటో వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ జరుగుతాయి.
ఏడేళ్లలోపు పిల్లలకు బాల ఆధార్ ఆప్టేట్ చేయకపోతే చెల్లదు. ఈ నవీకరణ ప్రక్రియ పిల్లలకు, తల్లిదండ్రులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఆధార్ సంబంధిత సేవల వినియోగాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.బాల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్ చాలా కీలకం.. పాఠశాల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాలకు ఇది చాలా అవసరం.
UIDAI ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపి, పాఠశాలల మధ్య తిప్పుతూ బాల ఆధార్ అప్డేట్ ప్రక్రియను నిర్వహించనుంది.ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పిల్లలు సకాలంలో పొందేలా చేయడం ఉడాయ్ లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని UIDAI పరీక్షిస్తోంది. మరో రెండు నెల్లలో పాఠశాలల్లో అమలు చేయనుంది.