viral video: వామ్మో.. పెళ్లైన స్త్రీని ప్రేమిస్తే ఇలా శిక్షిస్తారా? చెప్పులతో కొట్టి, యూరిన్ తాగించి, ఊరేగించారు

viral video: వామ్మో.. పెళ్లైన స్త్రీని ప్రేమిస్తే ఇలా శిక్షిస్తారా? చెప్పులతో కొట్టి, యూరిన్ తాగించి, ఊరేగించారు

పెళ్లైయిన మహిళతో ప్రేమాయణం సాగించిన ఓ వ్యక్తి గ్రామస్తులు కఠిన శిక్షలు విధించారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలోని భిల్ఖేడి గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన  ఇద్దరు పిల్లలున్న స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరూ రాజస్థాన్ పారిపోయారు. గ్రామస్థులు, మహిళ కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని తీసుకొచ్చారు. వారిపై గ్రామస్తులు కర్కషంగా వ్యవహరించారు. ఇద్దర్ని చెప్పులతో కొట్టి, చెట్టుకు కట్టేశారు. యువకుడికి సగం మీసం తీసేసి, జుట్టు కత్తిరించారు. చెప్పుల దండ వేసి ఊరేగించారు. 

అంతే కాదు అతన్ని తిడుతూ బూట్లను తన నోట్లో కుక్కారు. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ యువకుడితో బలవంతంగా బాటిల్ లోని మూత్రం తాగించారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియోలో చెక్కర్లు కొడుతుంది. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో వారు బాధితునికి కాల్ చేసి మాట్లాడారు. బుధవారం ఆ యువకుడిని కలిసేందుకు పోలీసులు వెళ్లగా అతను ఇంట్లో లేడు. అతని తల్లిదండ్రల ఆచూకీ కోసం ప్రయత్నించి, పోలీసులు తర్వాత గ్రామస్థులపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు.

Also Read: ఎంతకు తెగించావురా : ఐస్ క్రీంలో అది కలిపినోడు అరెస్ట్..!