ఉజ్జయిని మహంకాళికి.. బోనమెత్తిన యూఎస్ కాన్సులేట్ జనరల్​

ఉజ్జయిని మహంకాళికి.. బోనమెత్తిన యూఎస్ కాన్సులేట్ జనరల్​

సికింద్రాబాద్, వెలుగు: అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ బోనమెత్తారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శనివా రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి ఆలయానికి తలపై బోనం పెట్టుకొని, వచ్చి అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. ఆమె అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెన్నీఫర్‌‌‌‌ను ఆలయ అర్చకులు సత్కరించి, అమ్మవారి చీరను బహూకరించారు.