
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో మిడిల్ ఈస్ట్ లో మరింత ఉద్రిక్తతలు పెరిగాయి.UK అదనపు సైన్యాన్ని, ముఖ్యంగా యుద్ధ విమానాలను కీలక స్థావరాలకు తరలించింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడులలో UKకు ప్రత్యక్ష ప్రమేయం లేదని ఈ దాడులు ఏకపక్షంగా జరిగినవని UK చెబుతున్నప్పటికీ ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అమెరికా ,ఇజ్రాయెల్‌తో కలిసి బ్రిటీష్ యుద్ధ విమానాలు సాయం చేయడం మిడిల్ ఈస్ట్ లో మరింత ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన మొదటి దాడులను ప్రారంభించినప్పటి నుంచి UK ప్రధాని స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరితోనూ టచ్ లో ఉన్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఇజ్రాయెల్‌పై డ్రోన్లు ,క్షిపణుల దాడులతో ఇరాన్ ప్రతిదాడులు చేసింది. పరిస్థితి వేగంగా మారుతోంది..అలాగే తీవ్రంగా ఉందన్నారు స్టార్మర్.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణను UK తీవ్రంగా భావిస్తోంది.ఉద్రిక్తతలను తగ్గించి, శాంతియుత పరిష్కారం కనుగొనాలని అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి సిద్దం అని స్టార్మర్ చెబుతూనే UK అదనపు సైన్యాన్ని, ముఖ్యంగా యుద్ధ విమానాలను కీలక స్థావరాలకు తరలించడం, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇజ్రాయెల్‌కు స్వీయ-రక్షణ హక్కు ఉందని చెబుతూనే సంఘర్షణకు దౌత్య పరిష్కారం అవసరమని అంటున్నారు స్టార్మర్. దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని UK సూచిస్తోంది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని ,ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల ప్రాధాన్యతను నొక్కొ చెబుతున్నారు యూకే ప్రధాని స్టార్మర్. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతియుత పరిష్కారానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెబుతోంది.