భారతీయులకు యూకే హైకమిషన్ గుడ్ న్యూస్

భారతీయులకు యూకే హైకమిషన్ గుడ్ న్యూస్

భారతీయులకు యూకే హైకమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. భారతీయులకు 15 రోజుల్లో వీసా కల్పిస్తామని చెప్పింది. వీసా దరఖాస్తుల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలపై బ్రిటీష్ హైకమిషనర్ వేగంగా పనిచేస్తోందని..దీంతో ప్రజలు త్వరగా వీసాలు పొందొచ్చని బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 89శాతం పెరిగిందన్నారు.  స్కిల్డ్ వర్కర్ వీసాల ప్రాసెసింగ్ వేగంగా జరిగిందని..విజిటర్ వీసాల సమయానికి తగిన శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు.

భారత్ నుంచి యూకే ప్రయాణానికి అపూర్వమైన డిమాండ్ పెరిగిందని ఎల్లిస్ తెలిపారు. కరోనా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కారణంగా యూకే 15 రోజుల వీసా ప్రమాణాన్ని రద్దు చేసింది.  యూకేలో చదవుకునేందుకు వీసాలు పొందడంలో చైనాను భారత్ అధిగమించింది. జూన్ నాటికి సుమారు 118000మంది భారతీయ విద్యార్థులు వీసాలు పొందారు. ఇది గతేడాది కంటే 89 శాతం పెరిగింది. 2022 జూన్ నాటికి 258000 కంటే ఎక్కువ మంది భారతీయులు టూరిజం వీసాలు పొందారు.గతేడాదితో పోలిస్తే ఇది 630 శాతం అధికమని చెప్పారు.