చీజ్ బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు.. మెక్‌డొనాల్డ్స్‌కు రూ. 5 కోట్ల జరిమానా

 చీజ్ బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు..  మెక్‌డొనాల్డ్స్‌కు రూ. 5 కోట్ల జరిమానా

ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన లండన్‌లోని మెక్‌డొనాల్డ్ స్టోర్‌కి  కోర్టు రూ.5 కోట్ల జరిమానా విధించింది. చీజ్ బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కస్టమర్ కంప్లెయింట్ చేయడంతో విచారణ చేపట్టిన కోర్టు మెక్ డొనాల్డ్ సంస్థకు జరిమానా విధించింది.  

ఒక మహిళా కస్టమర్ 2021లో చీజ్ బర్గర్‌ ను ఆర్డర్ చేసింది.   రాపర్ ఓపెన్ చేసి తినబోతుండగా దుర్వాసన వచ్చింది. దీంతో మొత్తం ఓపెన్ చేసి చూడగా అందులో ఎలుక వ్యర్థాలు కనిపించాయి. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆ కస్టమర్ హెల్త్ అఫీషియల్స్‌కి కంప్లెయింట్ చేసింది. ఆమె చేసిన  కంప్లెయింట్ ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు  స్టోర్‌ మొత్తాన్ని  పరిశీలించారు. 

 ఏ మాత్రం శుభ్రత లేకుండా ఉండటం, స్టోర్ మొత్తం ఎలుక వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ కనిపించడం, స్టాఫ్‌ కూడా ఏ మాత్రం శుభ్రత లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా అధికారులు  గుర్తించారు. దీంతో స్టోర్ యాజమాన్యంపై మొత్తం మూడు కేసులు  నమోదు కగా విచారణ చేపట్టిన కోర్టు   రెండేళ్ల తర్వాత మెక్‌డొనాల్డ్‌కి రూ.5 కోట్ల జరిమానా విధించింది. 

ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మెక్ డొనాల్డ్ సంస్థ బాధితురాలికి సుమారు రూ.4.8 కోట్ల జరిమానా చెల్లించాలి.  అలాగే, చట్టపరమైన చర్యల కోసం మహిళ చేసిన ఖర్చు రూ.22.6 లక్షలు కాగా, అదనంగా రూ.19,537 మొత్తం రూ.5 కోట్ల పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని సమాచారం.