బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ: రీసెంట్ గా కరోనా నుంచి కోలుకున్న యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తమ దేశ ప్రజలను సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందిగా కోరారు. అంటువ్యాధిని ఆపడానికి సామాజిక దూరం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ లో బోరిస్ తన సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘దేశంలోని లక్షలాది మంది ప్రజలు సరైన రీతిలో పని చేస్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ కష్ట నష్టాలకు ఓర్చి.. ఓపికగా తమతోపాటు ఇతరుల కేర్ గురించి ఆలోచించి, శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరికీ కృతజ్ఞతలు. దీన్ని ఇలాగే కొనసాగించండి’ అని జాన్సన్ విజ్ఞప్తి చేశారు.
