శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు

శ్రీ కృష్ణ జ‌న్మాష్టమి వేడుక‌ల్లో బ్రిట‌న్ ప్రధాని ప‌ద‌వి రేసులో ఉన్న  రిషి సునక్  పాల్గొన్నారు. పండగ నేపథ్యంలో ఆయన తన భార్య అక్షత మూర్తితో కలిసి భ‌క్తివేదాంత మ‌నోర్‌ ఆల‌యాన్ని  సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణుడి పుట్టిన‌రోజును జ‌న్మాష్టమి పేరుతో వేడుక‌లు నిర్వహిస్తార‌ని.. అందుకే తాను గుడికి వెళ్లినట్టుగా రిషి సునక్ తన ట్విట్టర్ లో  పేర్కొన్నారు. 

రిషి,అక్షత‌లు హిందూ ధ‌ర్మాన్ని పాటిస్తున్నారు. ఇదిలా ఉంటే  ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌ కు, ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్ మ‌ధ్య గ‌ట్టి పోటీ న‌డుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.  ప్రస్తుత స‌ర్వేల ప్రకారం అయితే రిషి సునాక్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది.