దిగొచ్చిన యూకే: కొవిషీల్డ్‌కు గుర్తింపు

దిగొచ్చిన యూకే: కొవిషీల్డ్‌కు గుర్తింపు

బ్రిటన్ ప్రయాణాలపై ఇటీవల విడుదల చేసిన నిబంధనలపై భారత్‌లో ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు కూడా బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై శశిథరూర్ వంటి ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదని భారత విదేశాంగ శాఖ కూడా హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం దిగొచ్చింది.

తమ ప్రకటనను సవరించి కొత్తగా మరో ప్రకటన చేసింది. దానిలో కొవిషీల్డ్‌కు యూకే గుర్తింపు లభించినట్లు తెలిపింది. దీంతో నాలుగు వ్యాక్సిన్లకు యూకే గుర్తింపు లభించినట్లు ఈ ప్రకటనలో చెప్పింది. ఇంతకుముందు చేసిన ప్రకటనలో ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా, ఫైజర్ బయాన్‌ టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గుర్తింపు ఇచ్చిన యూకే ప్రభుత్వం తాజాగా మరో నాలుగు ఫార్ములేషన్లకు కూడా అనుమతినిచ్చింది. ఈ జాబితాలో ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాగ్జెవేరియా, మోడెర్నా టకేడా టీకాల ఫార్ములేషన్లకు స్థానం దక్కింది. 

అంతేకాదు.. రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిని కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు యూకే తెలిపింది. అయితే కేవలం యూకే గుర్తింపు పొందిన వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ అనుమతులు లభించనున్నాయి. అయితే ఈ సడలింపులన్నీ అక్టోబరు 4 సోమవారం ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.

Read More:

బైడెన్ పిలుపు.. ప్రధాని మోడీ అమెరికా ప్రయాణం

‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

సామాన్యులకు దహనం.. స్వామీజీలకు సమాధి: ఇలా ఎందుకంటే?