సరియైన వరుడు దొరలేదని.. తననుతానే పెళ్లి చేసుకున్న మహిళ

సరియైన వరుడు దొరలేదని..  తననుతానే పెళ్లి చేసుకున్న మహిళ

పెళ్లి అంటే ప్రతి మనిషి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం..మంచి లైఫ్ పార్టినర్ ను ఎంచుకొని గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవాలని పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు కలలు కంటుంటారు.. లైఫ్ పార్టినర్ తో జీవితం ఆనందంగా గడపాలని ఎక్కువ సమయం కష్టపడుతూ పెళ్లికి ముందే సంపాదిస్తుంటారు కొందరు.. కొందరైతే కాబోయే జీవిత భాగస్వామి కోసం ముందుగానే కావాల్సినవన్నీ కొనిపెట్టుకుంటుంటారు.. సరిగ్గా ఇలాంటి ఓ మహిళ లైఫ్ పార్టినర్ కోసం ఏళ్లపాటు తపన పడింది. తనకు కావాల్సిన వరుడికోసం బోలెడంతా సంపాదన కూడబెట్టింది. అయితే సరియైన పార్టినర్ దొరక్కపోవడంతో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 

లండన్ కు చెందిన 42 యేళ్లా సారా విల్కిన్సన్.. 2023 సెప్టెంబర్ 30న ఇప్పుడు కట్టుబాట్లు, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇప్పటి వరకు ఎవరూ చేసుకొని రీతిలోపెళ్లి చేసుకుంది. లక్షలు పెట్టి మరీ గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి మరీ పెళ్లి చేసుకుంది... అయితే సారా పక్కన వరుడు కనిపించడు.. తనకు తానే పెళ్లి రింగు మార్చుకుంది.. పెళ్లిలో వధువరులు చేసే అన్ని పనులు తనకు తానే చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మధ్య ఈ మ్యారేజ్ ను గ్రాండ్ గా చేసుకుంది.. అదేమిటి వరుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు.. అదే ఇక్కడ ట్విస్ట్.. 

సారా తన 20 యేటనుంచి తన పెళ్లి కోసం సంపాదన మొదలు పెట్టింది. ఈడు జోడు ఉన్న వరుడిని ఎంచుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని బాగానే సంపాదించింది. దాదాపు 20 యేళ్లుగా సంపాదిస్తూనే ఉంది. అయితే సారా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.. 

ఏళ్ల తరబడి కష్టపడి పెళ్లి చేసుకొని జీవితం లో స్థిరపడాలనుకున్న సారాకు.. వరుడి విషయంలో నిరాశే మిగిలింది.. ఈడుజోడు ఉన్న వరుడు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన సారాకు.. సరియైన వరుడు  దొరకలేదు.. దీంతో ఎంతో నిరాశ చెందింది. సంపాదించిన డబ్బంతా ఏం చేయాలి.. ఎవరికోసం ఖర్చు పెట్టాలి అని ఆలోచనలో పడింది. ఏం వరుడి లేకుండా నేను పెళ్లి చేసుకోలేనా.. వరుడు లేకున్నా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది..

అనుకున్నదే ముమూర్తంగా పెళ్లి పనులు మొదలు పెట్టింది. గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది.. మ్యారేజ్ ఉంగరాలు ఆర్డర్ ఇచ్చింది. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను అందరికి ఆహ్వానం పంపింది.. 
2023 సెప్టెంబర్ 30న జరిగిన వేడుకలో ఆమె పెళ్లి వేడుకలో 40 మంది ప్రియమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో తన స్నేహితుల మధ్య తనకు మాత్రమే ప్రత్యేకమైన రోజును జరుపుకుంది. సాయంత్రం తర్వాత మరో 40 మంది వ్యక్తులు వీధిలోని టెన్నిస్ క్లబ్‌లో ఇచ్చిన పార్టీ వేడుకలో పాల్గొన్నారు. 


ALSO READ: దేవభూమిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలివే.. లిస్టవుట్ చేసిన మోదీ
 

ఎవరూ ఊహించని తన పెళ్లి గురించి సారా ఇలా చెప్పింది. ఇది అధికారిక వివాహం కానప్పటికీ నాకు పెళ్లి జరిగింది. నా పక్కన భాగస్వామి లేకున్నా.. ఉన్నట్లే భావిస్తాను.. నేను పెళ్లి కోసమే ఎన్నో ఏళ్లేగా కష్టపడి డబ్బు సంపాదించాను.. నేను చేయాలనుకున్న దాని కోసం ఖర్చు చేశాను.. ఇది నిజంగా పెళ్లిలాగే భావించాలి’’  అని సారా తన సంతృప్తిని తెలియజేసింది.