ఉక్రెయిన్​లోని రెండు టౌన్​లపై రష్యా షెల్లింగ్

ఉక్రెయిన్​లోని రెండు టౌన్​లపై  రష్యా షెల్లింగ్

కీవ్/మాస్కో: సెంట్రల్ ఉక్రెయిన్ లోని దినిప్రోపెట్రోవిస్క్ రీజియన్ లో రష్యన్ బలగాలు మంగళవారం రాత్రి దాడులతో విరుచుకుపడ్డాయి. రష్యా షెల్లింగ్​లో 21 మంది పౌరులు చనిపోయారని బుధవారం స్థానిక గవర్నర్ వాలెంటిన్ రెజ్నిచెంకో వెల్లడించారు. నికోపోల్ జిల్లాలో 11 మంది, మార్గనెట్స్ టౌన్​లో 10 మంది మరణించారని తెలిపారు. రాత్రంతా భయానక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆఫీసులున్న బిల్డింగ్​లు, అపార్ట్​మెంట్లు, ఒక స్కూల్, కల్చరల్ ప్యాలెస్, సిటీ కౌన్సిల్ బిల్డింగ్ కూడా ధ్వంసం అయ్యాయని చెప్పారు. సిటీలో పవర్ కట్ అయిందని, వేలాదిమంది జనం చీకట్లలో మగ్గుతున్నారని తెలిపారు. మరిన్ని ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించారు.  

రష్యన్ జర్నలిస్ట్ పై క్రిమినల్ కేసు 

ఉక్రెయిన్​పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ప్రసారంలోనే నిరసన తెలిపి.. ప్రభుత్వ ‘చానెల్ వన్’లో ఉద్యోగాన్ని వదులుకున్న జర్నలిస్ట్ మెరీనా ఓవ్ శ్యానికోవా ఇంట్లో రష్యన్ అధికారులు బుధవారం రెయిడ్స్ చేపట్టారు. రష్యన్ బలగాల గురించి ఆమె తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ క్రిమినల్ కేసు పెట్టారు. యుద్ధం మొదలైనంక తెచ్చిన చట్టం ప్రకారం ఈ కేసు పెట్టారని మెరీనా లాయర్ చెప్పారు.