బోర్డర్కు 50కిమీ దూరంలో చిక్కుకున్న భారతీయులు

బోర్డర్కు 50కిమీ దూరంలో చిక్కుకున్న భారతీయులు

ఉక్రెయిన్​లోని సుమీలో చిక్కుకుపోయిన 700 మంది ఇండియన్ల తరలింపుకు బ్రేక్ పడింది. శనివారం నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్న మన స్టూడెంట్లు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. ఇదే క్రమంలో బాంబు దాడులు కొనసాగుతుండటంతో వాళ్లను బార్డర్ దాటించాలన్న ప్రయత్నం నిలిచిపోయిందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. చలిని తట్టుకోలేక మరోపక్క నీళ్లు, తిండి లేకపోవడంతో సుమీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్డర్​కు కాలినడకన బయల్దేరుతామని స్డూడెంట్లు వీడియోల ద్వారా తెలియజేశారు. కానీ, మన ప్రభుత్వం ఆ ఆలోచన వద్దని సూచించింది. వాళ్లందరినీ భద్రంగా తరలించేందుకు సహకరించాలని రష్యాను కోరింది. ఈ మేరకు కీవ్ నుంచి బెలారస్​కు, ఖార్కివ్ నుంచి రష్యాకు స్టూడెంట్ల తరలింపుకు సాయం చేస్తామని రష్యా  అంగీకరించింది. సోమవారం షెల్లింగ్ కొనసాగుతుండటంతో మన స్టూడెంట్లను తరలించాలన్న ప్రయత్నం నిలిచిపోయింది.