ఓ వైపు బాంబుల వర్షం... మరో వైపు ప్రజా ప్రతినిధుల కిడ్నాప్

ఓ వైపు బాంబుల వర్షం... మరో వైపు ప్రజా ప్రతినిధుల కిడ్నాప్

కీవ్: బాంబులు, మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న రష్యా సేనలు ఇవాళ మరో మేయర్ ను కిడ్నాప్ చేశాయి. ఇప్పటి వరకు ఇద్దరు మేయర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో మేయర్ ను కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. ఒకవైపు ఉక్రెయిన్ తో చర్చలు కొనసాగిస్తూ.. మరో వైపు బాంబుల వర్షంతో విరుచుకుపడుతున్న రష్యా ఉక్రెయిన్ నగరాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రజాస్వామ్య యుతంగా  స్థానిక ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేసి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
స్కాడోవ్స్క నగర మేయర్ ఒలెక్సాండర్ యూకోవ్లీవ్ తోపాటు ఆయన పాలక మండలి సహచరుడు డిప్యూటీ యూరి పల్యూఖ్ లను కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వారందరినీ సురక్షితంగా విడుదల చేసేలా ప్రపంచ దేశాలు,  అంతర్జాతీయ సంస్థలు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఘప్తి చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

గౌరవం ఇవ్వని చోట ఉండలేను