రష్యాపై మండిపడ్డ జెలెన్​ స్కీ

రష్యాపై మండిపడ్డ జెలెన్​ స్కీ

కీవ్: రష్యా దాడులపై ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని భూమిపై నుంచి తుడిచిపెట్టేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగా మిసైల్స్​తో దాడులు చేస్తున్నదని విమర్శించారు. ఈమేరకు సోషల్​ మీడియాలో ఓ వీడియోను పోస్ట్​ చేశారు. సోమవారం జరిపిన దాడుల్లో అమాయక ప్రజలు చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని అన్నారు.

కీవ్​తో పాటు ఉక్రెయిన్​పై మొత్తం 75 మిసైల్స్​తో దాడి చేశారన్నారు. ఎనర్జీ ఇన్​ఫ్రాస్ర్టక్చర్, అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు తెగబడుతున్నదన్నారు. వీటి కోసం ఇరాన్ ​డ్రోన్​లను ఉపయోగిస్తోందన్నారు. ఉక్రెయిన్​వ్యాప్తంగా రష్యా వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉందని, ప్రజలందరూ షెల్టర్ల​లోనే ఉండాలని జెలెన్​స్కీ సూచించారు. గాయపడినవారు కూడా బయటికి రావొద్దన్నారు.