
చెన్నై : అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ (యూటీటీ) ఐదో సీజన్‌ను 8 జట్లతో మొదలుపెట్టనున్నారు. ఈసారి కొత్తగా అహ్మదాబాద్ ఎస్‌జీ పైపర్స్, జైపూర్ పేట్రియాట్స్‌ను తీసుకున్నారు. ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. 2017లో మొదలైన ఈ లీగ్‌లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ముగిశాయి. గోవా ఛాలెంజర్స్ యూటీటీ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. దబాంగ్ ఢిల్లీ టీటీసీ, యు ముంబా టీటీ, పుణేరి పల్టాన్, బెంగళూరు స్మాషర్స్ లీగ్‌లోని మిగతా జట్లు. ప్రతి జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో సహా ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. జట్ల సంఖ్య ఎనిమిదికి చేరడంతో ఈసారి ఫార్మాట్ ను కూడా స్వల్పంగా మార్చారు.