జమ్మూ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతుల్ని విసరగలడు. అతని నేచురల్ పేస్, టాలెంట్ కి ప్రపంచం మెచ్చుకోనివాళ్లు, పొగడనివాళ్లు లేరు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉమ్రాన్ మాలిక్ కి టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సలహా ఇచ్చాడు. ఉమ్రాన్ లైన్ అండ్ లెంగ్త్ పై పట్టు సాధిస్తే ప్రపంచాన్ని ఏలగలడని అన్నాడు.
వీళ్ల కన్వర్జేషన్ వీడియోను బీసీసీఐ టీవీలో టెలికాస్ట్ అయింది. అందులో షమీ ‘ఉమ్రాన్.. నీ పేస్ ని ఎదురుకొని క్రీజ్ లో నిలబడటం అంత తేలిక కాదు. పేస్ ఉన్నప్పటికీ నువ్వు లైన్ అండ్ లెంగ్త్ పై దృష్టి పెట్టాలి. నీకు ఎంతో శక్తి ఉంది. భవిష్యత్తు మెరుగ్గా కనిపిస్తుంది. వీటిపై దృష్టి పెడితే ప్రపంచాన్ని ఏలగలవు’ అని సూచనలు చేశాడు. టీ20, వన్డేల్లో ఉమ్రాన్ మాలిక్ కి ఛాన్స్ లు వచ్చినప్పుడల్లా మెరుగ్గా రాణిస్తున్నాడు. తాజాగా 157 కిలోమీటర్ల బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
