130 దేశాలకు అసలు కరోనా వ్యాక్సిన్ అందలేదు

130 దేశాలకు అసలు కరోనా వ్యాక్సిన్ అందలేదు

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 130 దేశాలకు ఇప్పటీ వ్యాక్సిన్ అందలేదని UNO ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రేస్ తెలిపారు. 75 శాతం డోసులు కేవలం 10 దేశాలకు మాత్రమే అందాయని తెలిపారు. ఇది అత్యంత దారుణమైన అసమానతగా ఉందని చెప్పారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు గ్లోబల్ వ్యాక్సిన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు గుటెర్రేస్.