బాలికల విద్య కోసం అన్‌అకాడమీ శిక్షోదయ 

బాలికల విద్య కోసం అన్‌అకాడమీ శిక్షోదయ 

బాలికల్లో డ్రాప్ ఔట్లను నియంత్రించి ..విద్యాభివృద్ధిని పెంచేందుకు అన్ అకాడమి శిక్షోదయ కార్యక్రమం ప్రారంభించింది.ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 5 లక్షల మందికి బాలికలకు విద్యను అందించడమే లక్ష్యం పెట్టుకుంది అన్ అకాడమి. ఈ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది ప్రజల జీవితాలలో సానుకూల మార్పును తీసుకురానున్నారు. ఉద్యోగం పొందిన మహిళలతో 4-5గురు సభ్యులు కలిగిన కుటుంబంపై ప్రభావం పడుతుందని అంచనా. పాఠశాల విద్యను ఆపేసిన బాలికలు, ప్రస్తుతం స్కూల్లు, కాలేజీల్లో  చేరడంతో పాటుగా ప్రధానస్రవంతి విద్యలో మిళితమయ్యేందుకు తగిన అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.

శిక్షోదయతో, ఐదు లక్షల మంది బాలికలు తగిన విజ్ఞానం మరియు నైపుణ్యం పొందనున్నారు. ఈ నైపుణ్యాలు తమతో పాటుగా తమ కమ్యూనిటీల అభివృద్ధికి తోడ్పడడంతో పాటుగా భారతదేశపు వృద్ధి కథలో భాగం కావడంతో పాటుగా తమ లక్ష్యాలను చేరుకునేందుకు కూడా తోడ్పడుతుంది.

కేవలం ఐదు లక్షల మంది బాలికలలో మాత్రమే పరివర్తన తీసుకురావడంతో పాటుగా వారి కుటుంబాలు , సమాజంపై కూడా సానుకూల ప్రభావం చూపగలదన్నారు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ . దీంతో దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. సృజనాత్మక, అందుబాటు ధరలలోని పద్ధతుల ద్వారా విద్యను సమూలంగా మార్చే సామర్థ్యం ఎడ్‌టెక్‌కు ఉంది. అంతేకాదు, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేందుకు శక్తివంతమైన పాత్రనూ ఇది పోషిస్తుంది. అన్‌అకాడమీ, ఈ సాంకేతిక శక్తిని వినియోగించుకోవడాన్ని  లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో  మారుమూల ప్రాంతాలలో కూడా నాణ్యమైన విద్యను అందించగలదు. శిక్షోదయ అనేది ఓ మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అన్‌అకడామీ కేవలం బాలికలు ఉద్యోగం పొందేందుకు తోడ్పడటం మాత్రమే కాదు.. అదే సమయంలో పాఠశాల విద్య ఆపేసిన బాలికలు తమంతట తాము సంపాదించుకోగలరనే భరోసానూ అందిస్తుందన్నారు.