ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవాల జోరు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవాల జోరు

ములుగు/ మల్హర్/ హసన్ పర్తి/ నెక్కొండ/ నల్లబెల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఒక్కటవుతున్నారు. అంతా కలిసి నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకుంటామంటూ ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పలు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 

 రెండో విడత ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి మండలం ముద్దునూరుతండా, గుర్తూర్​ తండా, కొడిశెలకుంట, దేవనగర్​జీపీలు, ములుగు మండలంలో జగ్గన్నపేటలో అర్రెం వెంకన్న, అంకన్నగూడెం కొట్టెం రాజు, రాయినిగడెంఈసం సునీత, కొత్తూరు గట్టి సుదర్శన్, బంజరుపల్లి కంచం రఘు, పెగడపల్లి గొల్ల కుమార్ ఏకగ్రీవమయ్యారు. 

వెంకటాపూర్​ మండలంలో అడవి రంగాపూర్​, కేశవాపూర్​, తిమ్మాపూర్​, పాపయ్యపల్లి, నర్సింగాపూర్​ జీపీల సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలంలోని దుబ్బపేట (తండా),  వరంగల్​ జిల్లా నెక్కొండ మండలంలో చిన్నకోర్పోల్, టీకే తండా, వెంకట్​తండా, దేవునితండా​ఏకగ్రీవం కాగా, దుగ్గొండి మండలం నారాయణతండాలో నామినేషన్​ వేసిన వ్యక్తులు విత్​డ్రా చేసుకోగా, ఒకే వ్యక్తి బరిలో ఉండడంతో ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారు.  హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం ఆర్వపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.