మార్చురీలలో జాగా సరిపోలె

మార్చురీలలో జాగా సరిపోలె

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్  జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలతో బాలాసోర్  ఆస్పత్రులలోని మార్చురీలు నిండిపోయాయి. మృతదేహాలు ఉంచేందుకూ స్థలం సరిపోవడం లేదు. దీంతో 187 బాడీలను బాలాసోర్  నుంచి భువనేశ్వర్  ఎయిమ్స్ కు తరలించారు. ఇక్కడ కూడా ఆ మృతదేహాలను ఉంచేందుకు స్థలం చాలడం లేదు. ఇక్కడ తరలించినలో 187 బాడీల్లో 110 మృతదేహాలను మాత్రమే ఎయిమ్స్ లో ఉంచారు.

మిగతా మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పరిరక్షించడం సవాలుగా మారిందని భువనేశ్వర్  ఎయిమ్స్  అధికారులు తెలిపారు. శవపేటికలు, ఐస్, ఫోర్మాలిన్  కెమికల్స్ తో బాడీలను భద్రపరిచామని చెప్పారు. రైళ్ల ప్రమాదంలో చనిపోయిన వారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో మృతుల గుర్తింపు కష్టంగా మారిందని ఒడిశా హెల్త్  మినిస్టర్  షాలిని పండిట్  వెల్లడించారు.

మృతదేహాల గుర్తింపు కోసం ఫొటోలు, వారి వివరాలను స్పెషల్  రిలీఫ్​  కమిషనర్, భువనేశ్వర్  మునిసిపల్  కమిషనర్, ఒడిశా స్టేట్  డిసస్టర్  మేనేజ్ మెంట్  అథారిటీ వెబ్ సైట్ లో అప్ లోడ్  చేశామని షాలిని తెలిపారు.