బాలికపై లైంగికదాడికి యత్నించిన మేనమామ

బాలికపై లైంగికదాడికి యత్నించిన మేనమామ
  • తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక

తిమ్మాపూర్, వెలుగు : కాలేజీకి తీసుకెళ్తానని మేనకోడలిని బైక్‌‌ ఎక్కించుకున్న యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ పరిధిలోని తిమ్మాపూర్‌‌ మండలం అలుగునూరులో శుక్రవారం జరిగింది. సీఐ సదన్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్‌‌ గ్రామానికి చెందిన బాలిక కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతోంది. 

శుక్రవారం ఉదయం కాలేజీలో దింపుతానని బాలిక మేనమామ సంపంగి ప్రేమ్‌‌కుమార్‌‌ బైక్‌‌పై ఎక్కించుకొని కరీంనగర్‌‌ తీసుకొచ్చాడు. కాలేజీకి వెళ్లకుండా హైదరాబాద్‌‌ హైవే మీదుగా అలుగునూరులోని కాకతీయ కాలువ వద్దకు తీసుకురాగా.. అనుమానం వచ్చిన బాలిక బైక్‌‌ పైనుంచి దూకేసింది. తర్వాత ప్రేమ్‌‌కుమార్‌‌ బాలికను పక్కకు లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక అతడి నుంచి తప్పించుకొని కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ప్రేమ్‌‌కుమార్‌‌పై పోక్సో కేసు నమోదు చేశామని, అతడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.