80 కోట్ల మందికి ఫ్రీగా వైద్యం అందించాం

80 కోట్ల మందికి ఫ్రీగా వైద్యం అందించాం

కర్ణాటక: ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 80 కోట్ల పేదలకు ఫ్రీగా వైద్యమందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దెనహళ్లిలో జరిగిన మెడికల్ కాలేజీ  శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... గతంలో గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉండేదని, వైద్య విధానాల రూపకల్పనలో ఈ సమస్య పెద్ద సవాలుగా మారిందన్నారు. కానీ.. గత ఏడేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల వైద్య సదుపాయాలు మెరుగపడ్డాయన్నారు. 596 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసామన్నారు. రూ. 5 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసి కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే

ఢిల్లీలో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన